చందర్లపాడు (ఎన్‌టిఆర్) : మండల కేంద్రమైన చందర్లపాడులోని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల పై మండలంలోని తోటరాలపాడు, చింతలపాడు బొబ్బెల్లపాడు, చందర్లపాడు గ్రామాల్లో పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా చందర్లపాడు పంచాయతీ కార్యదర్శి యం.సాయిరాం మాట్లాడుతూ ...స్వచ్ఛతహిసేవ కార్యక్రమాలు 16 రోజులు ఉంటుందని, ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుందని శుక్రవారం పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ చెత్తకుండీలు ఉపయోగించాలని, చెత్తను రోడ్లమీద పడేయకుండా పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వలన ఎలాంటి అనారోగ్యాలకు తావు లేకుండా ఉంటుందని సూచించారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామాలు పరిశుభ్రంగా ఉండడం వలన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని ఎలాంటి అనారోగ్యాల పాలవకుండా ఉంటారని హితవు పలికారు. ప్లాస్టిక్ ను నిషేధించాలని అన్నారు. ప్రతి గ్రామాన్ని అభివఅద్ధి పథంలో తీసుకెళ్లాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ గ్రామస్తులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.










