Oct 02,2022 11:59

ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : మండలంలోని మడికిలో సర్పంచ్‌ ఉండ్రాజపు లక్ష్మి మౌనిక చిన్న, కార్యదర్శి మోక్షంజలి ఆధ్వర్యంలో స్వచ్ఛత కోసం అవగాహన ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ముందుగా గాంధీ జయంతి సందర్భంగా ..ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల స్వచ్ఛత కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అందరి సమిష్టి కఅషితోనే అది సాధ్యమని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అనంతరం సర్పంచ్‌ భర్త చిన్న పర్యవేక్షణలో గ్రామ పురవీధులలో బ్లీచింగ్‌ చల్లించి, దోమల నివారణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పడమటి సుజాత రాంబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.