Jun 20,2023 17:58

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. దీంతో చివరి రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో మైదానాన్ని కవర్లతో కప్పేసారు. ఇప్పటికే తొలి సెషన్‌ ఆటను అంపైర్లు రద్దు చేశారు. కాగా ఆస్ట్రేలియా విజయానికి 90 ఓవర్లలో 174 పరుగులు కావాలి. ఇంగ్లాండ్‌ ఏడు వికెట్లు తీయాల్సి ఉంది. స్థానిక కాలమానం (బర్మింగ్‌హౌమ్‌) ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే మ్యాచ్‌ ఆరంభమయ్యే (అంటే లంచ్‌ తర్వాత) అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఎడ్జ్‌బాస్టన్‌ గ్రౌండ్‌ను నల్లని మబ్బులు కమ్మేసాయి. వర్షం ఆగితేగానీ మ్యాచ్‌ ప్రారంభమయ్యే పరిస్థితి లేదు.