May 12,2023 14:05

ప్రజాశక్తి-మండపేట (తూర్పు గోదావరి) : స్థానిక ఆలమూరు రోడ్డులోని ఎస్‌.వి.పి.ఆర్‌.ఎం ఐ.టి.ఐలో సోమవారం ఐటిఐ ఫిట్టర్‌ చదివిన విద్యార్థులకు అప్రెంటిస్‌ మేళా జరుగుతుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.హనుమంతరావు శుక్రవారం ప్రకటించారు. ఆలమూరు మండలంలోని పినపళ్ల గ్రామంలో కృష్ణ ప్రభాస్‌ పేపర్‌ లిమిటెడ్‌ కంపెనీ ఐటిఐ ఫిట్టర్‌ పాస్‌ అయిన విద్యార్థులకు అప్రెంటిస్‌ కల్పిస్తుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సోమవారం ఉదయం 9 గంటలకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.