Jan 30,2023 21:14

లండన్‌ : అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య(ఏటిపి) తాజా ర్యాంకింగ్స్‌లోనూ నొవాక్‌ జకోవిచ్‌ సత్తా చాటాడు. ఏటిపి సోమవారం వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన నొవాక్‌ జకోవిచ్‌ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. టోర్నీ ప్రారంభానికి ముందు ఏటిపి ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో ఉన్న జకోవిచ్‌.. టైటిల్‌ నెగ్గే క్రమంలో 3వ సీడ్‌ సిట్సిపాస్‌ను ఫైనల్లో ఓడించడం ద్వారా అతని ర్యాంక్‌ మెరుగైంది. ఫిబ్రవరి 27వరకు జకోవిచ్‌ తన అగ్రస్థానాన్ని నిలుపుకుంటే.. 377వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న మాజీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్‌ ఆల్‌టైమ్‌ రికార్డును జకోవిచ్‌ బ్రేక్‌ చేయనున్నాడు.
ఏటిపి తాజా ర్యాంకింగ్స్‌..
పాయింట్లు
1. నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా) 7070
2. కార్లోస్‌ అల్కరాజ్‌(స్పెయిన్‌) 6730
3. స్టెఫోనాస్‌ సిట్సిపాస్‌(గ్రీక్‌) 6195
4. క్యాస్పర్‌ రూఢ్‌(నార్వే) 5765
5. ఆండ్రీ రుబ్లేవ్‌(రష్యా) 4200
6. రఫెల్‌ నాదల్‌(స్పెయిన్‌) 3815
7. ఫెలిక్స్‌ అగర్‌(కెనడా) 3715
8. టేలర్‌ ఫ్రిట్జ్‌(అమెరికా) 3410
9. హోల్జర్‌ రూనీ(డెన్మార్క్‌) 3045
10. హాబర్ట్‌ అల్కరాజ్‌(పోలండ్‌) 2995