అమరావతి : ఓ దుకాణంలో పేలుడు సంభవించి ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం సమీపంలోని ఓ దుకాణంలో పేలుడు సంభవించి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. సతీష్ అనే వ్యక్తి వాహనాలకు పెయింటింగ్ వేసే దుకాణంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం నాటి కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయింది.పేలుడు దాడికి ఆ వ్యక్తి ముక్కలు ముక్కలయ్యాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.










