హైదరాబాద్ : ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు ప్రయివేటు రంగంలోని బంధన్ బ్యాంక్ తెలిపింది. 600 రోజుల కాలపరిమితి కలిగిన రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై 8 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపింది. సాధారణ ఖాతాదారులకు అత్యధికంగా 7.5 శాతం వడ్డీరేటును, సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం పెంచి 8 శాతం వడ్డీ కల్పిస్తున్నట్లు తెలిపింది. దీన్ని పాత, కొత్త ఎఫ్‌డిలపై సోమవారం నుంచి అమల్లోకి తెచ్చినట్లు తెలిపింది.










