Mar 10,2023 08:09
  •  సర్కారు రాతపూర్వక హామీ
  •  16న మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన చర్చలపై ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చింది. చర్చల సారారశాన్ని, అంగీకరించిన అంశాలను రాతపూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేయడంతో తాజాగా ప్రభుత్వం అధికారికంగా తన నిర్ణయాలను ప్రకటించింది. ఇందులో కొన్ని అంశాలను ఎప్పటిలోగా పరిష్కరిస్తామన్న దానిపైనా వివరణ ఇచ్చింది. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న జిపిఎఫ్‌, మెడికల్‌ అలవెన్సులు, ఇతర అరశాలతోపాటు 12వ పిఆర్‌సి, డిఎ వంటివాటిపైనా స్పష్టత ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో చెప్పినట్లుగానే ఈ నెలాఖరునాటికి జిపిఎఫ్‌ బకాయిలు, మెడికల్‌ రీయింబర్స్‌మెరట్‌, హెల్త్‌ స్కీమ్‌ నిధులు, బీమా, టిఎ వంటివి చెల్లించనున్నట్లు, దీనికి సుమారు రూ.3 వేలకోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఆర్జిత సెలవులు, పింఛనుదారులకు గ్రాట్యూటీ కూడా నెలాఖరులోగా ఇవ్వనున్నట్లు ప్రకటించిరది. మరికొన్ని అంశాలను సెప్టెంబరులోగా పరిష్కరించనున్నట్లు పేర్కొంది. 2018 జులై ఒకటి, 2019 జనవరి ఒకటికి సంబంధించిన డిఎ బకాయిలను, ఆర్జిత సెలవులను రెరడు విడతలుగా చెల్లిరచనున్నట్లు పేర్కొంది. ప్రతియేటా సొంత ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు వస్తురడగా, అందులో రూ.90 వేల కోట్ల వరకు ఉద్యోగుల జీతాలు, పిరఛన్లకు చెల్లిస్తున్నట్లు వివరించిరది. అయినప్పటికీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. 12వ వేతన సవరణ, ఇతర ఉద్యోగ సంబంధిత అంశాలపై ఈ నెల 16న మరోసారి ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానున్నట్లు వివరించిరది. అన్ని అంశాలపై ప్రతినెలా తొలి, రెండో సోమవారాల్లో ఉద్యోగులతో చర్చించాలని అన్ని శాఖలకూ ఆదేశాలు జారీ చేశారు. సిఎస్‌ స్థాయిలో కూడా నెలకోసారి సమావేశం నిర్వహిరచనున్నారు. గురుకులాలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నురచి 62 ఏళ్లకు పెంచే విషయం కోర్టులో ఉరదని, తరువాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇక ప్రభుత్వ నిర్ణయాలను అధ్యయనం చేసిన అనంతరం ఉద్యోగ సంఘాలు ఎలాంటి ఉద్యమ విధానాలు అవలంభిస్తాయో చూడాల్సి ఉంది.