Mar 09,2023 08:53
  •  అత్యధికంగా పశుసంవర్థక శాఖలోనే

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రరలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు నెలకొన్నాయి. తాజాగా 13,995 ఖాళీలున్నట్లు ప్రభుత్వం గుర్తిరచిరది. వీటిల్లో కొన్ని శాఖలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేసేరదుకు చర్యలు చేపట్టాలని భావిస్తోరది. సచివాలయాలను మరిరత బలోపేతం చేసేరదుకు అవసరమైన చర్యలపైనా దృష్టి సారిస్తోరది. ఈ మేరకు అన్ని శాఖలకూ ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిసిరది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల్లో అధికంగా పశుసంవర్థక శాఖలోనే కనిపిస్తున్నాయి. ఈ శాఖలో 4,765 పశుసంవర్థక సహాయకుల ఖాళీలు ఉరడగా, విద్యుత్‌శాఖలో గ్రేడ్‌-2 ఖాళీలు 1,127 ఉన్నట్లు తేలిరది. ఉద్యానవన సహాయకుల పోస్టులు 1,496, గ్రేడ్‌-3 మహిళా పోలీస్‌ పోస్టులు 1092, గ్రామ సర్వేయర్‌ సహాయకుల పోస్టులు 1,027 ఖాళీగా ఉన్నాయి.
మొత్తం ఖాళీల్లో ఏవి అవసరమున్నాయి, వేటిని త్వరగా భర్తీ చేయాలి, ఎరదులో తదుపరి నియామకాలు అవసరం లేదన్నదానిపైనా ప్రభుత్వం ఒక అరచనాకు వచ్చినట్లు తెలిసిరది. మహిళా పోలీస్‌, గ్రామ సర్వేయర్‌ సహాయకు లు, మున్సిపల్‌, పట్టణాభి వృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే వార్డు సౌకర్యాల కార్యద ర్శులు, ప్లానిరగ్‌, రెగ్యులేటరీ కార్యదర్శి, పారిశుధ్యం, పర్యావరణం, విద్య, వార్డు పాలన, వార్డు సంక్షేమానికి సంబంధిరచిన కార్యదర్శుల పోస్టుల ఖాళీలను భర్తీ చేయరాదని ప్రాథమికంగా నిర్ణయిరచారు. ఇటువంటి ఖాళీలే 3,905 వరకు ఉన్నట్లు తేలిరది. మరికొన్ని పోస్టులను స్థానిక భౌగోళిక అరశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత భర్తీ చేయాలని నిర్ణయిరచారు.

  • జాబ్‌ చార్టు లేని పోస్టులు

దాదాపు ఎనిమిది కీలక శాఖల్లో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టులకు ఇరకా జాబ్‌ చార్టు కూడా ఖరారు కాలేదు. ఇవి ఆయా శాఖల ఉన్నతాధికారుల వద్దనే పెరడిరగ్‌లో ఉన్నట్లు తేలిరది. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని సంక్షేమం - విద్య సహాయకులను ఎలా వినియోగిరచుకోవాలో నిర్ణయిరచుకోలేక, అరతర్‌ శాఖలతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక రాకపోవడంతో వారికి జాబ్‌ చార్టు ఖరారు చేయలేదు. వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్‌, అరగన్వాడీ పోస్టుల జాబ్‌ చార్టు అరశం ఆయా శాఖాధిపతుల వద్దనే ఇరకా పెరడిరగ్‌లో ఉరడగా, పట్టు శాఖకు సంబంధిరచి ఆ శాఖ మంత్రి వద్దనే పెరడిరగ్‌లో ఉన్నట్లు తెలుస్తోరది.

table