- లీగ్ దశలోనే నిష్క్రమించిన బెంగళూరు, గుజరాత్
ముంబయి: మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) ప్లే-ఆఫ్ బెర్త్‌లు ఖరారయ్యాయి. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యుపి వారియర్స్ జట్టు 3వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్‌పై విజయం సాధించింది. దీంతో యుపి జట్టు 8పాయింట్లతో మూడోస్థానంలో నిలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే-ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బ్రాబౌర్న్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 178పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. హేమలత(57), గార్డినర్(60) అర్ధసెంచరీలతో రాణించారు. గైక్వాడ్, పార్శవి చోప్రాకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో యుపి వారియర్స్ జట్టు 19.5ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 181పరుగులు చేసి విజయం సాధించింది. మెక్‌గ్రాత్(57), హర్రీస్(72)కి తోడు ఎక్లేస్టోన్(19) బ్యాటింగ్‌లో రాణించారు. కిమ్ గరాత్‌కు రెండు, మోనిక, గార్డినర్, కన్వర్, స్నేV్‌ా రాణాకు ఒక్కో వికెట్ దక్కాయి. ఈ ఓటమితో గుజరాత్ ప్లే-ఆఫ్ ఆశలు దారులు మూసుకుపోయాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గ్రేస్ హర్రీస్‌కు లభించింది.










