Apr 30,2023 15:14
  • ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ 

ప్రజాశక్తి-భవనిపురం : బీసీ సంక్షేమ భవన్ గొల్లపూడిలో ఆదివారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 330వ ఆరాధన సందర్భంగా గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ నందు చైర్మన్ తోలేటి శ్రీకాంత్ స్వామి వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనాడు వై యస్ ఆర్ జిల్లాలో బ్రహ్మం గారి మఠం నందు జీవ సమాధిలోకి ప్రవేశించిన రోజు అని ఈనాటికీ కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా భక్తుల పూజలందుకుంటున్నరు అన్నారు. 400 ఏళ్ల క్రితమే సమాజానికి సన్మార్గం చూపిన స్వామి వారు మానవులు అందరూ ఒక్కటేనని కుల మత జాతి బేధాలు లేకుండా జీవించాలని ప్రభిదించారు అన్నారు. ఆయన తత్వాలు బోధనలు ద్వారా భవిషత్ లో జరుగబోయే విషయాలు తెలిపి అందరూ భక్తి మార్గం లో పయనించాలని తెలిపారు వారు చెప్పిన అనేక వింతలు విశేషాలు ఇప్పటికీ జరుగుతున్నవి అన్నారు ఆయన చూపిన మార్గంలో అందరూ పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ యువజన నాయకులు జవ్వాది సుదీర్, నగర నాయకులు పుసులురి ప్రసాద్, దనాలకోట శ్రీనివాస్, మూర్తి, వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.