వలంటీర్లు, గృహసారథులు కలిసి పనిచేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : వలంటీర్లు, గృహసారథులు కలిసి పనిచేయాలని వైసిపి మండల అధ్యక్షులు సిఎం ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని దాసరపల్లి పంచాయతీలో వలంటీర్లు గృహ సారథులు సచివాలయ కన్వీనర్లకు సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి యువ నాయకులు అభినవరెడ్డి ఆదేశాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ వలంటీర్లలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చేపాలని కోరి ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందుకుంటే వారిని గుర్తించి వెంటనే సంక్షేమ పథకాలు అందించాలన్నారు. గృహ సారథుల ఎవరైనా ప్రలోభాలు గురిచేసిన వాటికి నమ్మకుండా మీరు జగనన్న కోసం మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుపునకు పనిచేయాలని ప్రతి సంక్షేమ పథకం అర్హులకు అందజేసి 2024 అత్యధిక మెజార్టీ గెలుపు ప్రతిఒక్కరిపై ఉందని బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మండల జెసిఎస్ కన్వీనర్ కల్లూరు కృష్ణారెడ్డి, దాసరిపల్లి సర్పంచ్ గౌస్ మొహిద్దీన్, ఎంపిడిఒ షేక్.సుభహాన్, సచివాలయ కన్వీనర్ నారపరెడ్డి, వైసిపి నాయకులు ఇస్మాయిల్, మేరం పెద్ద సుబ్బయ్య, ఇత్తడి రమణయ్య పాల్గొన్నారు.










