May 23,2023 23:00

ప్రజాశక్తి-గంపలగూడెం: రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ప్రభుత్వం ఏడు దాపాలుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచిందని మండల టిడిపి నాయకులు పేర్కొన్నారు. స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద టిడిపి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యుత్‌ కోతలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రేగళ్ల వీరారెడ్డి, సీనియర్‌ నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు, మండల యువ నాయకులు మానికొండ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రజాశక్తి- జగ్గయ్యపేట: విద్యుత్‌ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ జగ్గయ్యపేట పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద గల సబ్‌ స్టేషన్‌ వద్ద టిడిపి జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేక వెంకటేశ్వర్లు, కట్టా వెంకట నరసింహారావు, గింజుపల్లి రమేష్‌, కానూరి కిషోర్‌ బాబు, వార్డు కౌన్సిలర్లు నకిరకంటి వెంకట్‌, పేరం సైదేశ్వర రావు, గొట్టే నాగరాజు నాయకులు షేక్‌ అన్వర్‌, షేక్‌ మదార్‌, మారేపల్లి శౌరి, బొందిలి బాలాజీ సింగ్‌, శ్రీనాథ్‌, రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-వీరులపాడు: మండలంలో అల్లూరు గ్రామంలో ఉన్న విద్యుత్‌ సబ్స్టేషన్‌ వద్ద టిడిపి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కే శ్రీనివాసరావు, గువ్వల సత్యనారాయణ, కోడెల కుటుంబరావు, శిధిలాల భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-మైలవరం: అప్రకటిత విద్యుత్‌ కోతలు, పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని కోరుతూ మంగళవారం స్థానిక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో లంక లితీష్‌, మల్లెల రాధా, సుభాని, దూరు బాలకష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-కంచికచర్ల: పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించడంతో పాటు, అప్రకటిత విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో స్థానిక సబ్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కోగంటి బాబు, మాజీ ఎంపిపి అల్లడి కోటేశ్వరరావు, మాగంటి బాబు, పుల్లారావు, వేమా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: లక్ష్మీపురం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి నల్లగట్ల స్వామిదాస్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు బొమ్మసాని మహేష్‌, నాయకులు వాసం మునియ్య, సంకు రాత్రి జనార్దన్‌ రావు, అబ్దుల్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-నందిగామ: చందాపురం గ్రామ సబ్‌ స్టేషన్‌ ముందు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కనపర్తి శ్రీనివాస్‌, వీరంకి వీరస్వామి, తోట నాగమల్లేశ్వరరావు, ఏచూరి రాము, కాసర్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: కొండపల్లి మున్సిపాలిటీలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు విసన కర్రలు, లాంతర్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అప్రకటిత విద్యుత్‌ కోతలు ఆపాలని, విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.