పుట్టపర్తి రూరల్ : విద్యార్థులు మూఢనమ్మకాలను విడనాడి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పెడపల్లి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెడపల్లి ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన చేపట్టారు. ఈసందర్భంగా విద్యార్థులు పలు ప్రయోగాలను చేసి ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల సైన్సు ఉపాధ్యాయురాలు రమామని, నరసింహారెడ్డి, గోపాల్ రావు, నిర్మల సహకారంతో అన్ని తరగతుల విద్యార్థులు తయారుచేసిన పలు నమూనాలను ప్రదర్శించి వాటి గురించి వివరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రకళ రామమూర్తి, వెంకట రాముడు, చన్న కృష్ణారెడ్డి, మోహన్ బాలాజీ, విష్ణు వర్ధన్, శ్రీనివాసులు, రమాదేవి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మడకశిర : పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిర్మయి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈసందర్భంగా విద్యార్థులు వివిధ అంశాలకు సంబంధించిన సైన్స్ మోడల్స్, ప్రాజెక్ట్స్, ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించారు. ఆరు నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న దాదాపు 70 మంది తమకు కేటాయించిన అంశాలపై వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ టీచర్ అంజలీదేవి, ఆదిలక్ష్మి, చంద్రకళ, లక్ష్మీదేవమ్మ, రామంజమ్మ తదితరులు పాల్గొన్నారు.










