గ్రామాలతో పాటు పట్నం లోని బస్తీలలో రౌండప్ పరీక్షలు చేయటం ద్వారా కరోనా కట్టడి ప్రాథమికంగా సాధ్యపడుతుంది. మన రాష్ట్ర ప్రజల్లో అవగాహన పెరిగి స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవడానికి బారులు తీరుతున్నారు. అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. క్షేత్ర స్థాయిలో ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్న తీరును పర్యవేక్షించేవారు కరువయ్యారు. ప్రజలు సహకరించడంతో వేగంగా అన్ని ప్రాంతాల్లో పరీక్షలు చేయించేందుకు ప్రభుత్వం ఉపక్రమించాలి. ఫలితాల వెల్లడికి వారం పది రోజులు తీసుకోకుండా సత్వరం వెంటనే ప్రకటించాలి.
- ఉప్పలపు శేషునాథ్,
పి. నైనవరం గ్రామం,
కృష్ణా జిల్లా.










