Sep 20,2023 20:48

వెంకట్రావును అభినందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు పట్టణ వైసిపి అధ్యక్షులుగా ఎంపికైన షేక్‌ రఫీని , కందుకూరు మండలం వైసిపి అధ్యక్షులుగా ఎంపికైన గంగవరపు వెంకటరావును పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరు నియోజకవర్గ వైసిపి సోషల్‌ మీడియా కో-కన్వీనర్‌ అయూబ్‌ ఖాన్‌ పఠాన్‌, కందుకూరు మండల కన్వీనర్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి , కో-కన్వీనర్‌ మహేష్‌ ,పట్టణ కో-కన్వీనర్‌ అభిషేక్‌, జవహార్‌ బాషా, సందని, నవాజ్‌ షరీఫ్‌ కలిశారు.