Nov 19,2023 23:08

మాట్లాడుతున్న ముత్తుముల అశోక్‌ రెడ్డి

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌ : వైసిపి పాలనంలో అభివృద్ధి శూన్యమని టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని నరవ గ్రామంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి ఇంటింటికీ తిరిగి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివద్ధి తప్ప వైసిపి పాలనలో ఎలాంటి అభివద్ధి జరగలేదన్నారు. పంచాయతీ నిధులను స్వాహా చేసిన ఘనత జగన్‌ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. వైసిపి అరాచక, దోపిడీ పాలనకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుకు మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్ర మంలో టిడిపి మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, జడ్‌పిటిసి బుడతా మధుసూదన్‌ యాదవ్‌, కుసుమమాల మహానంది యాదవ్‌, గోడి ఓబుల్‌ రెడ్డి, టీడీపీ, జనసేన నాయకులు వీరిశెట్టి బాలకష్ణ, బాబాయి, జిల్లెల్ల భూపాల్‌ రెడ్డి, దామిరెడ్డి పాండు, బూనబోయిన శేఖర్‌ యాదవ్‌, ఈదుల రామకష్ణా రెడ్డి, మాజీ సర్పంచులు కడియం శేషగిరి, బోధనబోయిన గోపాలకష్ణ యాదవ్‌, గిద్దలూరు పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ శానేశావలి, గొంటు బ్రహ్మారెడ్డి, చేరెడ్డి రసూల్‌ రెడ్డి, బద్రి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.