Sep 19,2023 21:15

ఫొటో : పట్టుబడిన వాహనాలు

వాహనాలు పట్టివేత
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని పల్లిపాడు చెరువు నుండి ఆక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న స్థానికుల సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి తన సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనాలను పట్టుకున్నామని ఇరిగేషన్‌ ఎఇ యాసిన్‌ తెలిపారు. మూడు రోజులుగా చెరువులో భారీ యంత్రాలతో మట్టిని తోలుతున్నట్లు వారు తెలియజేశారు.
ఈ మట్టిని చిన్నమాచనూరు ఇటుక బట్టీలకు తరలిస్తున్నట్లు కనుగొన్నారు. కేసు నమోదు చేసి మైనింగ్‌ అధికారులకు అప్పజెప్పగా, పోలీసులు మట్టితో ఉన్న మూడు వాహనాలను, జెసిబిని పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చెరువులో ఎంత మట్టి తరలించారో కొలతలు ప్రకారం మట్టికి, వాహనాలకు చలానా కడితే వాహనాలను వదులుతామని ఏఈ తెలిపారు.