ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : టిడిపి నేత ఆదిరెడ్డి వాసు అరెస్టు అక్రమమని టిడిపి సీనియర్ నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధం లేని., ఫిర్యాదులు లేని చిట్ ఫండ్ వ్యవహారాల్లో జగన్ రెడ్డి రాజకీయ శునకానందం కోసమే బీసీ నేతలైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసును సిఐడి పోలీసులు అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో గళం విప్పుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష కట్టడం దారుణమని జగన్ రాజు అన్నారు. ఓవైపు వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ దూకుడు పెంచుతున్న క్రమంలో కేవలం ప్రజల దృష్టి మరల్చడానికే బీసీ నేతలను టార్గెట్ చేశారని అన్నారు.










