దేశీయంగా క్రిప్టో కరెన్సీ త్వరలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. క్రిప్టో కరెన్సీలకు పన్ను రాయితీ లేదని, క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను విధించనున్నట్లు ఆమె తెలిపారు.










