Sep 19,2023 21:35

ఫొటో : రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న టిడిపి నాయకులు

టిడిపి రిలే నిరాహార దీక్షలు
ప్రజాశక్తి-కావలి : నియోజవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు 6 రోజుకు చేరాయి. దీక్షలో పార్టీ పరిశీలకులు బొమ్మి సురేంద్ర, రాష్ట్ర పార్టీ కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగు యువత, టిఎన్‌టియుసి, టిఎన్‌ఎస్‌ఎఫ్‌, జనసేన నాయకులు, నియోజకవర్గంలోని టిడిపి శ్రేణులందరూ అధిక సంఖ్యలో కూర్చున్నారు. ''నేను సైతం - బాబు కోసం'' అనే బోర్డును ఏర్పాటు చేసి అందులో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ చంద్రబాబును ఎలాగైనా జైలుకు పంపించాలనే ధ్యేయంతో కక్ష గట్టి జైలుకు పంపడం జరిగిందన్నారు.
ఏది ఏమైనా త్వరలో కడిగిన ఆణిముత్యంలా చంద్రబాబు బయటికి రానున్నారని, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన మాటలు చాలా ధైర్యాన్ని ఇచ్చాయని, టిడిపి, జనసేన కలిసి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైసిపి నేతలు చేస్తున్న దారుణమైన చర్యలపై మండిపడ్డారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, బొట్లగుంట శ్రీహరి నాయుడు, గుత్తికొండ కిషోర్‌ బాబు, సురేంద్ర, శ్రీను, జనసేన నాయకులు మన్నెపల్లి రిషికేష్‌, ఆలా శ్రీనాథ్‌, జనసేన కావలి టౌన్‌ ప్రెసిడెంట్‌ పోబ్బసాయి విటల్‌, అధికార కోఆర్డినేటర్‌ సుదీర్‌,రూరల్‌ ప్రెసిడెంట్‌ వెంకయ్య, నాగార్జున, ఆది, అజరు, సంజరు, ప్రవీణ్‌, జనసేన కార్యకర్తలు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు పాల్గొన్నారు.