ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణా జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలిండియా జూనియర్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ సోమవారం నుండి ప్రారంభమైంది. ఈటోర్నమెంట్‌కు ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ ఎస్. రామకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ జరగడం అభినందనీయమని తెలిపారు. విజయవాడ నగరం క్రీడలకు ఎంతో ప్రసిద్ది చెందిందని, ఇక్కడ నుండి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో చక్కగా రాణిస్తున్నారని అన్నారు. రానున్న కాలంలో మరింత మంది క్రీడాకారులు రావాలని కోరారు. ఈకార్యక్రమంలో కృష్ణాజిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్. జయదేవ్, సెక్రటరీ డాక్టర్ వై. రామ్‌కుమార్, టోర్నమెంట్ చైర్మన్ కె.రాధా కృష్ణమూర్తి, టోర్నమెంట్ డైరెక్టర్ ఎం.మల్లిఖార్జునరావు, పలువురు క్రీడాకారులు, క్రీడా ప్రతినిధులు పాల్గొన్నారు.










