ప్రజాశక్తి - రెడ్డిగూడెం : శనివారం నాడు విడుదలైన పదోతరగతి ఫలితాల్లో రెడ్డిగూడెం మండలంలో 59.6%ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాశాఖాధికారి పి రఘురాం తెలిపారు. రెడ్డిగూడెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 63 మందికి 17 మంది, నాగులూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి 66 మందికి 30 మంది, కూనపరాజుపర్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి 31 మందికి 11మంది,కుదప జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి 20 మందికి 9మంది, ఎపి మోడల్ స్కూల్ నుంచి 70 మందికి 50 మంది, కస్తూరిబా గాంధీ విద్యాలయం నుంచి 33 మందికి 16 మంది, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి 79 మందికి 62 మంది, గీతాంజలి హైస్కూల్ నుంచి 69 మందికి 62 మంది, నారాయణ హైస్కూల్ నుంచి 11 మందికి 10 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఎంఇఓ రఘురాం తెలిపారు.
- గీతాంజలి విద్యార్థుల ప్రతిభ
పదోతరగతి ఫలితాల్లో గీతాంజలి హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ జి మల్లికార్జున రెడ్డి తెలిపారు. వేల్పుల చరిత 600 మార్కులకు గాను 584, బొమ్మిన సింధు 582 మార్కులు సాధించారని తెలిపారు.










