ప్రజాశక్తి-సింగ్‌నగర్: పుచ్చపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం లెనిన్‌సెంటర్‌లో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు కోరారు. గురువారం 58, 60, 61, 63, 64, వడ్డెర కాలనీ, ఎక్సెల్ ఫ్యాక్టరీ వాంబే కాలనీ, ఉడా కాలనీ, కండ్రిక ప్రాంతాల్లో సుందరయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య కార్మికులు, కష్టజీవుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ పరిష్కారానికి కృషి చేశారన్నారు. నేడు అధికారంలో ఉన్న బిజెపి, వైసిపి ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించి కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకువస్తూ కార్మికులకు పోరాడే హక్కు లేకుండా చేస్తున్నాయని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం కుల, మత ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ పాలన సాగిస్తుందని, ఈ తరుణంలో ప్రజలందరూ ఐక్యమత్యంతో సుందరయ్య ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంరాష్ట్ర కమిటీ సభ్యులు కె.శ్రీదేవి, సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె.దుర్గారావు, నగర కమిటీ సభ్యులు సిహెచ్ శ్రీనివాస్, జి.ఝాన్సీరాణి, ఎస్.కె.పీరు సాహెబ్, నాయకులు బొంగు రాంబాబు, ఎం.వి ఆంజనేయులు, ఎ.నాగబ్రహ్మం, పి.వెంకటరెడ్డి, పి.సాంబిరెడ్డి, ఎం.హనుమంతరావు, ఇమ్మంది నాగరాజు, ఎస్.కె.ఆబీద్ అలీ తదితరులు పాల్గొన్నారు.










