న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు ఎగబాకినట్లు కనిపించినప్పటికీ.. బడ్జెట్ అనంతరం నేల చూపులు చూస్తున్నాయి. బడ్జెట్ ప్రసంగం సాగుతున్నంత సేపు.. లాభాల్లో ట్రేడవ్వగా.. ఇప్పుడు కిందకు దిగుతున్నాయి. సెన్సెక్స్ మంగళవారం 59,000 పాయింట్లకు చేరువగా దూసుకెళ్లగా.. మధ్యాహ్నం ప్రసంగం అయిన పోయిన తర్వాత.. మధ్యాహ్నం 1.14 నిమిషాలకు బిఎస్‌ఇ సెన్సెక్స్ 70.65 పాయింట్ల క్షీణించి 58,201.06 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల క్షీణించి 17,303. 80 వద్ద ట్రేడవుతున్నాయి. దాదాపు 1276 షేర్లు లాభపడితే.. 1815 షేర్లు పతనమయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.










