శరవేగంగా ఆనకట్ట పనులు
ప్రజాశక్తి-ఉదయగిరి : నాణ్యత ప్రమాణాలతో పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ ఎఇలు చంద్రమౌళి, సిహెచ్ వేణు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆనకట్ట సమీపంలో జరుగుతున్న బ్రిడ్జి పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనకట్ట పనులు ముమ్మరంగా సాగుతున్నాయని నవంబర్ కల్లా బ్రిడ్జి పనులు పూర్తి చేసేందుకు పనులను శరవేగంగా చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా బ్రిడ్జి రివెట్ మెంట్ పనులు చేపడుతూ వాకర్లకు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. అనంతరం చేపడుతున్న పనులను వారు పరిశీలించారు. వారి వెంట కాంట్రాక్టర్ అక్కి భాస్కర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.










