ప్రజాశక్తి-నెల్లూరు :విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతోపాటు, కష్టపడి పనిచేసి సంస్థకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్‌ఈ వి.విజయన్ వైసిపి విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులకు సూచించారు. బుధవారం విద్యుత్ భవన్ లో నూతన ఎస్.ఈ. వి.విజియన్‌ని వైఎస్‌ఆర్ విద్యుత్తు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్.ఈ. గా నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన వి. విజయన్‌ను వైయస్‌ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్.ఈ. మాట్లాడుతూ సిబ్బంది అందరూ వచ్చి కలవడం మంచి సంప్రదాయమన్నారు. అనంతరం వైయస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ సెక్రెటరీ జి.వి శివయ్య మాట్లాడుతూ మా యూనియన్ తరపున మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ జిల్లా అభివద్ధికి తోడ్పడుతామన్నారు. అదే సమయంలో విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లలో మీరు తీర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రీజినల్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు మరియు డివిజన్ సెక్రెటరీ లు సాంబశివరావు, షరీఫ్,శివ,సంజీవ మూర్తి, మధు, సభ్యులు సురేష్,కేశవ, సుబ్రహ్మణ్యం, త్రివేణు, భాస్కర్, సుధ, సుబ్బరాయులు, చందు,షమిర్,హాజరత్, శ్రీనివాసులు,మోషే, షాహిద్, పాల్గొన్నారు.










