ప్రజాశక్తి -కందుకూరు : అనగారినర్గాలకు అండగా నిలుస్తూ సుదీర్ఘ చరిత్ర లో ఎన్నో విజయాలు సాధించిన భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు పేర్కొన్నారు. సిపిఐ 98వ వ్యవస్థాపక దినోత్సవం సోమవరం కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించారు సురేష్ బాబు మాట్లాడారు. కార్యమ్రకంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి మాలకొండయ్య మాట్లాడారు. ఎఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వై ఆనందమోహన్, సిపిఐ నాయకులు నత్తా రామారావు, డి.ఆదినారాయణ, ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు చేవూరి దుర్గాప్రసాద్, బొజ్జ చంద్రమోహన్, యువజన నాయకులు నీలి శెట్టి కష్ణబాబు, శ్రీకాంత్, దాసరి వెంకటరావు ,హరిబాబు, సిపిఐ నాయకులు బొల్లోజుల బాల బ్రహ్మచారి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.










