Dec 26,2022 22:18

వినతి పత్రం అందజేస్తున్న వ్య.కా.సం.జిల్లా నాయకులు.

వినతి పత్రం అందజేస్తున్న వ్య.కా.సం.జిల్లా నాయకులు.

రశీదులివ్వాలి

ప్రజాశక్తి-కావలి: కావలి డివిజన్‌లోని రైతులకు చెందిన అన్ని పొలాలకు ''ఈక్రాప్‌'' చేయించి, రశీదులివ్వాలని కోరుతూ వ్యవసాయకార్మికసంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో ఆర్‌డిఒ వి.కె.శీనా నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాళ్ళూరు మాల్యాద్రి మాట్లాడుతూఈ క్రాప్‌కు ఎక్కితేనే రైతుభరోసా, సున్నావడ్డీ, విత్తనసబ్సిడీ ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్‌, పంటరుణాలు, చివరికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో పంటను రైతులు అమ్ముకోవాలన్నా 'ఈక్రాప్‌'అవసరమని ప్రభుత్వం తెలియజేస్తుందన్నారు
. కిందిస్థాయిలో 'ఈక్రాప్‌'పారదర్శకత ప్రశ్నార్ధకంగా తయారైందన్నారు.