May 07,2023 16:31

ప్రజాశక్తి-వెలిగొండ : వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ ను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. వర్షపు నీరు చేరడంతో అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. టన్నెల్ బయట దాదాపు 15 అడుగుల మేర నీరు నిలిచినట్లు గుర్తించారు. ఇప్పటికే 9 మోటార్లతో నీటిని బయటకు పంపుతున్నామని మంత్రి తెలిపారు. మరో 9 మోటార్లతో నీరు వెళ్లగొట్టి త్వరగా పనులు పునః ప్రారంభించాలని మంత్రి సురేష్. సూచించారు.