Nov 24,2022 21:55

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ రమణారెడ్డి

         ప్రజాశక్తి-హిందూపురం   రైతన్నల సంక్షేమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ రమణారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని డిడిఎ వెటర్నరీ శిక్షణ కేంద్రంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులతో సంభాషిస్తూ సిహెచ్‌సి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యానవన శాఖలో రైతులకు ఇస్తున్న ప్యాకహేౌస్‌, డ్రిప్పు, స్ప్రింక్లర్‌ సబ్సిడీలు, వాటి పనితీరు గురించి వివరించారు. పట్టు పరిశ్రమ శాఖలో షెడ్లు, మల్బరీ పంటకు ఇస్తున్నటువంటి సబ్సిడీల గురించి సమగ్రంగా వివరించారు. అనంతరం గ్రామస్థాయి, మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి పనితీరును పరిశీలించారు. ఈ సమావేశంలో డివిజన్‌ స్థాయి సలహా మండలి ఛైర్మన్‌ బసిరెడ్డి, జెడ్పిటిసి నాగభూషణం, వైస్‌ ఎంపిపి రఘునాథ్‌రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ పురుషోత్తం రెడ్డి, మండల వ్యవసాయాధికారి ఇమ్రాన్‌, వ్యవసాయ విస్తరణ అధికారి శంకర్‌, రైతు సంఘం నాయకుడు సిద్ధారెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, ఆర్‌బికె సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.