May 18,2023 22:40

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: స్థానిక గేట్స్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌ అండ్‌ సైన్సెస్‌ గురునానక్‌ కాలనీ, విజయవాడ నందు రాష్ట్రస్థాయి మహిళ ఫిడే రేటింగ్‌ చదరంగం పోటీలను గురువారం ఎన్టీఆర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ అండ్‌ కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీ రావు జ్యోతి ప్రజ్వలన చేసి చదరంగం పోటీలను ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ చదరంగం ఆడటం వలన విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు.. చదరంగం క్రీడాకారులు కూడా చేసే ప్రతి పని ఆలోచించి ఉన్నతమైనటువంటి విజయాలను అందుకుంటారనీ అన్నారు.. అంతేకాకుండా తల్లితండ్రులు క్రీడల పట్ల ఆసక్తితో తమ పిల్లలను రాణిస్తున్నారని, ఇటువంటి చదరంగం పోటీలకు సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి రోటరీ మిడ్‌ టౌన్‌ మరియు గేట్స్‌ మేనేజ్మెంట్‌ వారిని అభినందించారు. టోర్నీ ఆర్బిటర్‌ ఎం. రాజీవ్‌ మాట్లాడుతూ చదరంగం పోటీలకు రాష్ట్రంలోని అన్ని మారుమూల ప్రాంతాల నుంచి 78 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారనీ తెలిపారు.. మొదటి రోజు రెండు రౌండ్లు జరగగా టాప్‌ సీడ్‌ ఎన్టీఆర్‌ జిల్లా క్రీడాకారిని ఉమెన్‌ ఫిడే మాస్టర్‌ లాస్య జి, అనంతపురం క్రీడాకారిణి అస్మిత ఏ. పై గెలుపొందగా రెండవ సీడ్‌ ప్రకాశం జిల్లా క్రీడాకారిణి ఉమెన్‌ ఫిడే మాస్టర్‌ కే సాయి నిరూపమా, ఎన్టీఆర్‌ జిల్లా క్రీడాకారిణి అయిన నారాయణ రిషిత పై గెలుపొందగా... మూడవ సీడ్‌ కష్ణాజిల్లా క్రీడాకారిణి ఉమెన్‌ ఫీడ్‌ మాస్టర్‌ పి సుప్రీత అదే జిల్లాకు చెందిన కే శరణ్యపై గెలుపొందారనీ అన్నారు.. ఈ కార్యక్రమంలో రోటరీ మిడ్‌ టౌన్‌ విజయవాడ అధ్యక్ష కార్యదర్శులు కష్ణ ప్రభు, కె ఎస్‌ ఎన్‌ బాబు, ఉపాధ్యక్షులు బి రామ్మోహన్‌ రెడ్డి, జి మురళీకష్ణ గార్లు మరియు గేట్స్‌ ఇన్స్టిట్యూట్‌ మేనేజ్మెంట్‌ అండ్‌ సైన్సెస్‌ చైర్మన్‌ టి.కిషన్‌బాబు, టోర్నమెంట్‌ డైరెక్టర్‌ ఎం అనిత జిల్లా చదరంగం అధ్యక్ష కార్యదర్శులు ఎండి అక్బర్‌ పాషా మందుల రాజీవ్‌ పాల్గొన్నారు.