ప్రజాశక్తి-నందిగామ : నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 24న విజయవాడలో జరిగే సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ దేశ రక్షణ భేరి సిపిఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని గోడపత్రిక ఆవిష్కరణ, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు మాట్లాడుతూ దేశంలో అదానీలు, అంబానీలు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగాన్ని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతుందని మండిపడ్డారు. మరోవైపు ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వం విధానాలను తిప్పుకొట్టాలని, దేశభక్తి ముసుగులో ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్న బిజెపి కుట్రలను నిరసిస్తూ, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో రాష్ట్రానికి దగా చేసిన మోడీ సర్కార్ను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ నెల విజయవాడలో సెప్టెంబర్ 24న జరిగే బహిరంగ సభకు సిపిఎం పార్టీ సభ్యులు, సానుభూతిపరులు తరలి రావాలని కోరారు. ఈ బహిరంగ సభకు సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఎం కార్యదర్శి కామ్రేడ్ వి.శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సయ్యద్ ఖాసిం, ఏవి నారాయణ, జి గోపి, సిపిఎం పార్టీ శాఖా కార్యదర్శి కటికల సురేష్, కటారపురాయప్ప, చండ్ర సుబ్బారావు, ప్రత్తిపాటి శ్రీను, జాస్తి లోకేషం, రామకోటి తదితరులు పాల్గొన్నారు .










