May 18,2023 22:36

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: ఫ్యాషన్‌ రంగాన్ని ఎంచుకున్న విద్యార్థులు ఉపాధి అవకాశాలతో పాటు, సృజనాత్మకతతో ప్రతి ఒక్కరూ వ్యాపారాన్ని ప్రారంభించడంతో పాటు మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదుగుతారని సమన కాలేజ్‌ ఆఫ్‌ డిజైన్‌ స్టడీస్‌ చైర్‌పర్సన్‌ సమానా మూసావి అన్నారు. బెంజిసర్కిల్‌ వద్ద గల సమన కాలేజ్‌ ఆఫ్‌ డిజైన్‌ స్టడీస్‌ నందు గురువారం కళాశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా తొలత సంస్థ చైర్మన్‌ సమానా మూసావి మాట్లాడుతూ తమ సంస్థ ప్రారంభం నుండి ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులకు డిజైనింగ్‌ రంగంలో కోర్సులను అందించడంతో పాటు వారు సొంతంగా వివిధ సంస్థలను ఏర్పాటుచేసుకునే విధంగా తగిన ప్రోత్సాహం అందించినట్లు తెలిపారు ఇందులో భాగంగానేతమ వద్ద విద్యను అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు విదేశాలలో ఫ్యాషన్‌ డిజైనర్లుగా స్థిరపడటంతో పాటు కొంత మంది వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఎక్కువ మంది సొంతంగా డిజైనింగ్‌ రంగంలో వివిధ సంస్థలను ప్రారంభించి మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారని తెలిపారు. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్థూ యూనివర్శిటీ గుర్తింపుతో తమ వద్ద కోర్సులు చేసిన వారికి సర్టిఫికెట్లను అందిస్తున్నామరి తెలిపారు. బియస్సీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌తో పాటు, బియస్సీ ఇంటీరియర్‌ డిజైనింగ్‌లలో మూడేళ్ల డిగ్రీ కోర్సు, రెండేళ్ల మాస్టర్స్‌ డిగ్రీ కోర్సులతో పాటు, ఒక సంవత్సరం డిప్లమా కోర్సులను అందిస్తున్నామని తెలిపారు. వంద శాతం ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఈసందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు తాము చదువుకోవడంలో ఏవిధంగా మెళకువలు నేర్చుకోవడంతో పాటు సొంతంగా ఏవిధంగా యూనిట్లు ప్రారంభించినదీ, వివరించారు. ఈకార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌ పలువురు ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొన్నారు.