పుట్టపర్తి అర్బన్ : గ్రామీణ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడానికి తీసుకొచ్చిన జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు పరుస్తామని కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. గురువారం రాష్ట్ర పంచాయతీ, గ్రామీణ అభివద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామకంఠం సర్వే పనులు, పారిశుద్ధ్యం, విద్యుత్ బల్బులపై మాట్లాడారు. ఉపాధి హామీ పథకం, జలజీవన్ మిషన్ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీల విద్యుత్ బకాయిలు పంచాయతీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వెంటనే చెల్లించాలని కమిషనర్ ఆదేశించారు. చెత్త నుంచి సంపద పెంచే కేంద్రాల షెడ్లను వేగవంతంగా నిర్మించాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ నిషేధం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రోడ్ల నిర్మాణాలకు అవసరమయ్యే ప్లాస్టిక్ వేరు చేసి వినియోగించే విధంగా చూడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బసంత్ కుమార్ మాట్లాడుతూ వచ్చే వారంలోపు ఈ పనుల్లో పూర్తి స్థాయి పురోగతి చూపిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ సంపూర్ణ పారిశుధ్యం దిశగా పంచాయతీ తీర్మానాలను 24 గంటల్లోపు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన భవన నిర్మాణాలతో పాటు, గహ నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని అన్నారు.
నాడు-నేడు పనులను త్వరగా పూర్తి చేయాలి
నాడు-నేడు రెండవ దశ పనులను త్వరగా పూర్తి చేయాలని పాఠశాలల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి కలెక్టర్ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పాఠశాలల క్షేత్రస్థాయి నిర్మాణాల కార్యదర్శి భాస్కర్‌తో కలిసి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ఉన్నత స్థితి తీసుకెళ్లే విధంగా నాడు-నేడు కార్యక్రమాల ద్వారా అభివద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి విజరుకుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ పంచాయతీ రాజ్ ఎస్‌ఇలు రషీద్, గోపాల రెడ్డి, డ్వామా పీడీ రామాంజనేయులు, డీఈవో మీనాక్షి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.










