కదిరి టౌన్ : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కదిరి రూరల్ మండలం, కాలసముద్రం గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న తన పాలనలో విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంద్రారెడ్డి, జెడ్పీటీసీ రాధాబాయి, సర్పంచి లలితమ్మ, ఎంపీటీసీ ఓబులమ్మ, వైస్ ఎంపీపీ ఆనంద్ నాయక్, మండల కన్వీనర్ ప్రకాష్, జిల్లా అగ్రిగోల్డ్ మెంబర్ సుధీర్ రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, టెంపుల్ చైర్మన్ గోపాలకష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీవో సుధామణి, ఎస్‌ఎండి ఇస్మాయిల్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.










