అమరావతి : ప్రధాన మంత్రికి, కేంద్రమంత్రులకు లేఖలు రాస్తున్న ముఖ్యమంత్రికి విభజన చట్టం గుర్తులేదా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలు, నీటికేటాయింపుల వివరాలు, అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు అవశ్యకత గురించి ఎందుకు ప్రస్తావించలేదని బుధవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. 11వ షెడ్యూల్‌లోని సెక్షన్ 85.7(ఈ)లోని వివరాలు ఎందుకు గుర్తుకుచేయలేదన్నారు.










