సమక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ హరి నారాయణన్
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :జిల్లాలోని ఓటింగ్, పోలింగ్ స్టేషన్లకు సంబంధించి రాజకీయ పార్టీలతో కలెక్టర్ ఎం. హరినారాయణ్ గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో జరిగిన ఈ సమావేశానికి వైసిపి, టిడిపి, బిజెపి, సి పిఎం, సిపిఐ పార్టీ ల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యవసా య మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సూచనల మేర కు వైసీపీ ప్రతినిధిగా ఆ పార్టీ జిల్లా అధికార ప్రతి నిధి, జిల్లా గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ తలమంచి సు రేంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.










