Feb 01,2022 12:49

న్యూఢిల్లీ :  పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి 2022-23 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పెట్టారు. రెండవ సారి డిజిటల్‌గా.. మొత్తంగా నాల్గవ సారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39 లక్షల కోట్లుగా ఆమె పేర్కొన్నారు.  సుమారు రెండున్నర గంటల పాటు బడ్జెట్ ప్రసంగం జరిగింది. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతికి ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా వ్యాఖ్యానించారు.

పన్ను చెల్లింపు దారులకు మొండి చేయి...పెరగని శ్లాబులు
న్యూడిల్లీ : 2022-2023 బడ్జెట్‌పై ఎంతో ఆశగా ఎదురు చూసిన పన్ను చెల్లింపు దారులకు మొండి చేయే ఎదురైంది. ఆదాయపు పన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పన్ను దాఖలుకు సంబందింఛి అప్‌డేట్‌ చేసుకునేందుకు రెండేళ్ల సమయం మాత్రమే ఇచ్చింది. రిటర్న్స్‌ విషయంలో లోపాల సవరణకు అవకాశముంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పిఎస్‌) డిడక్షన్‌ ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్‌పిఎస్‌ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

దేశీయ పరిశ్రమలకు రక్షణ రంగ మూలధన సేకరణలో 68 శాతం కేటాయింంపు

న్యూఢిల్లీ : రక్షణ పరికరాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో.. రక్షణ రంగానికి సంబంధించిన మూల ధన సేకరణ బడ్జెట్‌లో 68 శాతం దేశీయ పరిశ్రమకు కేటాయిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆమె మాట్లాడుతూ. ఆత్మనిర్భర్‌ భారత్‌ను ప్రోత్సహించేందుకు.. రక్షణ పరికరాల దిగుమతులను తగ్గించేందుకు.. రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్‌లో 68 శాతం దేశీయ పరిశ్రమలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 58 శాతం అదనం. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్‌ అండ్‌ డి).. పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థల కోసం తెరుచుకోనుందని తెలిపారు. ప్రత్యేక ప్రయోజన వాహనం (ఎస్‌పివి) మోడల్‌ ద్వారా డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఒ), ఇతర సంస్థల సహకారంతో సైనిక ఫ్లాట్‌ఫారమ్‌లు, పరికరాల రూపకల్పన, అభివృద్ధిని చేపట్టేందుకు ప్రైవేటు పరిశ్రమలకు ప్రోత్సహిస్తామని నిర్మల తెలిపారు.


10.50

2022-23 బడ్జెట్‌ను మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. కరోనా దేశ ఆర్థిక వ్యవస్ధ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ బడ్జెట్‌ కీలకం కానుంది. అన్ని రంగాల వారు.. ఈ బడ్జెట్‌పై ఆశలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి కూడా డిజిటల్‌ రూపంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ బడ్జెట్‌కు కేంద్ర క్యాబినేట్‌ ఆమోదం తెలిపింది. మంగళవారం ఉదయం ఎరుపు రంగు రెడ్‌ కవర్‌లో జాతీయ చిహ్నంతో కూడిన టాబ్లెట్‌ను తీసుకుని.. పార్లమెంటుకు బయలు దేరారు.