Sep 21,2023 18:24

పంట కోత ప్రయోగాన్ని పరిశీలిస్తున్న దశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మండలంలోని పేడూరు గ్రామంలో ఆర్థిక, గణాంక శాఖ వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పంటకోత ప్రయోగం చేపట్టారు. మండల వ్యవసాయ శాఖ అధికారి శిరీష రాణి, వ్యవసాయ సహాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన పంటకోత ప్రయోగాన్ని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి, కార్యాలయపు ఉపగణాంకాధికారిణి వై. శోభారాణి పర్యవేక్షించారు. వ్యవసాయ విస్తరణాధికారి హరిబాబు, వ్యవసాయ సహాయకులు శివకుమార్‌, సుమంత్‌ లు ప్రయోగాన్ని నిర్వహించి యాప్‌ ద్వారా ఫలితాలను అప్లోడ్‌ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట కోత ప్రయోగ నిర్వహణా విధానాన్ని పర్యవేక్షించారు. ప్రయోగానంతరం దిగుబడి అంచనాలను పరిశీలించారు. తోటపల్లి గూడూరు మండల పరిధిలో నేటి వరకు జరిగిన ప్రయోగ ఫలితాల సరళిని బట్టి ప్రస్తుత ఖరీఫ్‌ సీజనులో దాదాపుగా సాధారణ దిగుబడులు నమోదవుతున్నట్లు మండల గణాంకాధికారి రాంప్రసాద్‌ తెలిపారు. తోటపల్లిగూడూరు విఏఎలు విద్యాసాగర్‌, వినీల్‌, క్షేత్రం సాగుదారులు పాల్గొన్నారు.