ప్రజాశక్తి -కందుకూరు : పేదలకు ఆపన్నహస్తం అందించాల్సిన అవసరముందని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం మీడియా చైర్మెన్ చక్కా వెంకట కేశవరావు పేర్కొన్నారు. ఆకలితో ఉన్న వారి ఆకలి తీరుద్దాం వారి కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం అనే నినాదంతో నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చక్కా వెంకట కేశవరావు పుట్టినరోజు సందర్బంగా వారి సహకారంతో సోమవారం విప్పగుంట రోడ్డులో ఉన్న పేదవారికి ఆహారం, పండ్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులను అభినందించారు. శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు మాట్లాడారు. శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఇన్నమూరి శ్రీను,చీదెళ్ళ కష్ణ, చక్కా చైతన్య గుప్తా పాల్గొన్నారు.










