ప్రజాశక్తి-కొమరోలు : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని ఎంపిపి కామూరి అమూల్య తెలిపారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం అనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.సంక్షేమ పథకాలు అమలు కావాలంటే 2024 ఎన్నికలలో మళ్లీ సిఎంగా జగన్ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచి రమణమ్మ, ఎంపిటిసిలు నిర్మల, శ్రీనివాసరెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగులుప్పలపాడు : మండల పరిధిలోని హెచ్.నిడమానూరులో రాష్ట్రానికి జగనే ఎందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో సర్పంచి వడ్డిముక్కల శ్రీనివాసరావు, ఉపసర్పంచి గండ్ర రమణారెడ్డి, ఎఎంసి చైర్మన్ మారెళ్ళ బంగారు బాబు, వైసిపి మండల అధ్యక్షుడు పొలవరపు శ్రీమన్నారాయణ, నోడల్ అధికారి వేణు కుమారి, జేసీఎస్ మండల ఆర్డినేటర్ కొమ్మూరి సుధాకర్ బాబు, నాయకులు పులిచర్ల పరంధామిరెడ్డి, బడే అంకిరెడ్డి, గ్రామ సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.