Nov 09,2022 21:36

న్యూఢిల్లీ  :   పంజాబ్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసు నిందితుడు, పరారైన డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోడీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ హైకోర్టు అంగీకరించింది. ఈ ఏడాది ప్రారంభంలో నీరవ్‌ మోడీ అప్పీల్‌ను విచారించిన జస్టిస్‌ జెరెమీ స్టవర్ట్‌- స్మిత్‌, జస్టిస్‌ రాబర్ట్‌ జే బుధవారం ఈ తీర్పుని వెలువరించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కి సంబంధించిన భారీ కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కొనేందుకు భారత్‌కు అప్పగించకూడదంటూ నీరవ్‌ మోడీ చేసిన అప్పీల్‌ను లండన్‌ హైకోర్టు కొట్టివేసింది. ఆగేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్న మోడీని భారత్‌కు అప్పగించాలంటూ జిల్లా జడ్జి సామ్‌ గూజీ వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ లండన్‌ హైకోర్టులో అప్పీల్‌ చేసేందుకు గత ఫిబ్రవరిలో అనుమతి లభించింది. మానసిక అనారోగ్యం రీత్యా తన విజ్ఞప్తిని పరిశీలించాలని అప్పీల్‌లో కోరారు. పంజాబ్‌ బ్యాంకులో రూ. 13,500 కోట్ల మేర రుణాలను ఎగవేసిన నీరవ్‌ మోడీ భారత్‌ నుండి పారిపోయిన సంగతి తెలిసిందే.