ప్రజాశక్తి -నెల్లూరు :గ్లోబల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ డైరెక్టర్ రాక్వెల్ ష్రాఫ్, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్‌తో పాటు రోటరీ నెల్లూరు ప్రతినిధి బందం, జిల్లా విద్యాధికారులతో కలిసి ఉపాధ్యాయులలో నోడల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పని చేయడానికి ఆనందంగా ఉందని అవెన్యూస్ స్కూల్ కరస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడారు. ఇండియా స్కూల్ ఎంగేజ్‌మెంట్ స్ట్రాటజీలో భాగంగా మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నిధులతో నెల్లూరు జిల్లాలోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో సామర్థ్య పెంపు కార్యక్రమం ద్వారా అమలు చేయబడిన కౌమార సాధికారత., పాఠ్యాంశాలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ,బోధనను అమలు చేయడం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాక్వెల్ ష్రాఫ్ మాటలు ఉపాధ్యాయులు, విద్యార్థుల వ్యక్తీకరించిన అభ్యసన ఫలితాలు, నైపుణ్యాల అభివద్ధి స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. ఈ ముఖ్యమైన సమావేశానికి సహకరించిన రోటరీ తక్షణ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వొమ్మిన నాగ సతీష్ బాబు, రోటరీ జిల్లా కార్యదర్శికొండా శేఖర్ రెడ్డిలకు పెనుబల్లి కష్ణ చైతన్య ధన్యవాదాలు తెలిపారు.










