Jan 17,2021 17:07

 శ్చిమ హిందూ మహాసముద్రంలో కొత్త రకం నీలి తిమింగలాలను గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో వచ్చిన ధ్వని రికార్డింగ్‌ విశ్లేషణ ఆధారంగా శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. ఇవి భూమిపై ఇప్పటివరకూ నివసించిన అతిపెద్ద జంతువులుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
    అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఈ క్షీరదాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని మహాసముద్రాల్లో కనిపిస్తాయి. అయితే వీటి సంఖ్య చాలా తక్కువని, ఇవి ఓ విధమైన ధ్వనిని చేస్తాయని, ప్రతి నీలి తిమింగలం ఓ ప్రత్యేకమైన ధ్వనిని చేస్తాయని అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్‌ అక్వేరియానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
  ఈ జాతి అంతరించిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఒమన్‌, అరేబియా సముద్రం, దక్షిణ మడగాస్కర్‌లోని ఈ జాతి ధ్వనులను విశ్లేషించారు. కాగా పశ్చిమ హిందూ మహాసముద్రంలోని ధ్వనికి మిగతా ప్రాంతాల్లోని ధ్వనికీ ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించినట్లు న్యూ ఇంగ్లాండ్‌ అక్వేరియం పరిశోధకులు సాల్వటోర్‌ సెర్చియో చెబుతున్నారు. అయితే గతంలో శ్రీలంకలో గుర్తించిన సంతతికి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు.

నీలి తిమింగలాల కొత్త సంతతి !నీలి తిమింగలాల కొత్త సంతతి !