Oct 13,2022 16:01

న్యూజిలాండ్‌: వందల సంఖ్యలో అరుదైన పైలట్‌ తిమింగలాలు మృత్యువాత పడిన విషాద సంఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌లోని మారుమూల బీచ్‌ల్లో 477 పైలట్‌ తిమింగలాలు ప్రాణాలు కోల్పోయాయి. పసిపిక్‌ సముద్ర తీరంలోని తపంగి తీరంలో 232, వైహేర్‌ బేలో మరో 245 తిమింగలాలు ప్రాణాలు కోల్పోయినట్లు పరిరక్షణ విభాగం ప్రకటించింది. గుట్టలుగా పడిఉన్న వాటి కళేబరాల దఅశ్యాలు కలచివేస్తున్నాయి. ఇలా వందల సంఖ్యలో అరుదైన పైలట్‌ తిమింగలాలు మఅత్యువాతపడటంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాటి మఅతికి కారణాలను అధికారులు వెల్లడించారు. తీరానికి వచ్చిన అవి తిరిగి సముద్రంలోకి వెళ్లలేకపోవడం వల్లే మఅతిచెందినట్లు పరిరక్షణ విభాగ సముద్ర సాంకేతిక సలహాదారు డేవ్‌ లండ్‌క్విస్ట్‌ తెలిపారు. వీటిలో అధిక శాతం సహజ సిద్ధంగానే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. తిరిగి సుముద్రంలోకి వెళ్తే షార్క్‌లు తినేస్తాయేమోననే భయంతోనే అవి తిరిగి వెళ్లలేదని నిపుణులు అనుమానిస్తున్నారు.ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో 200లకు పైగా పైలట్‌ తిమింగలాలు మఅత్యువాత పడిన ఘటన మరువక ముందే...న్యూజిలాండ్‌లోనూ ఇదే తరహా విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.