ప్రజాశక్తి-విశాఖ : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ సకల కార్మికుల మహా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద జీవీఎంసీ కాంట్రాక్టు మున్సిపల్ కార్మికుల సంఘం(సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికుల వారసత్వ పోస్టులను కార్మికుల పిల్లలకు ఇవ్వాలని, క్లాప్ డ్రైవర్లకు 18,500/- ఇవ్వాలని, జీవో -7 ప్రకారము చెల్లించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ స్కిల్డ్ సెమీస్కిల్డ్ ,చెల్లించాలని, డ్రైవర్లు, వెటర్నరీ, మలేరియా, యుజిడి, కార్మికులకు హెల్త్ అలవెన్సులు చెల్లించాలని, నగర ప్రజల సేవలకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేయాలని, 300 పోస్టుల అమ్మకాలపై దర్యాప్తు చేయాలని మరియు మిగిలిన మినిట్స్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సంఘం నాయకులు నూకరాజు, కుమారి, ఊరుకోటి రాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ సమస్యలు పరిష్కరిస్తానని జీవీఎంసీ ఏడీసీ సన్యాసి నాయుడు హామీ ఇచ్చారు.











