ప్రజాశక్తి-మైలవరం : మండలంలో, మైలవరం సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా కార్యదర్శి పిల్లి నరసింహారావు జెండా ఆవిష్కరించారు, పంచాయతీ కార్యాలయం వద్ద అధ్యక్ష కార్యదర్శులు శివ, వీరమ్మ, ఆవిష్కరించారు, సివిల్ సప్లై ముఠా కార్మికులు, శ్రీరామ్ ముఠా కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు, మార్కెట్ ముఠా కార్మికులు, చండ్రగూడెం, పుల్లూరు, గణపవరం, మొరుసుమిల్లి, కొత్తగూడెం, మంగాపురం, ప్రాంతాలలో ఘనంగా మే డే ఉత్సవాలు జరిపారు. హక్కుల కోసం పోరాడిన కార్మికుల విజయ గీతిక - శ్రమజీవుల సంఘటిత శక్తికి ప్రతీక - మేడే అంటూ నిందించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పిల్లి నరసింహారావు, మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్ మాట్లాడుతూ... 8 గంటల పని దినానికి కార్మికుల ఐక్యంగా పోరాడి 1886లో సాధించుకున్న పని గంటల పోరాటం ప్రపంచ చరిత్రనే కార్మికుడు కబంధహస్తాల్లోకి ,యాజమాన్యం వెన్నుపూసలు వణుకును పుట్టించింది. కార్మిక హక్కులు సాధన కోసం ఎర్ర జెండా విప్లవ పోరాటానికి సమాజ మార్పుకి అవసరమని గుర్తించింది నాటి కార్మిక వర్గం ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి పాలకవర్గం వరకు కార్మిక హక్కుల్ని అణిచివేయాలని కార్మికుల శ్రమను దోపిడీ చేయాలని చూస్తూనే ఉన్నారు. శ్రమజీవుల పనిని కారు చౌకగా మార్కెట్లో సరుకుగా మార్చి కట్టు బానిసలను చేస్తున్నారు. శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని పార్లమెంట్లో చట్టాలు చేయాలని అనేక పోరాటాలు చేస్తున్న నేటి బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్స్ ను అంబానీ ఆధానీలకు అనుకూలంగా మార్చడంతో కార్మికుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు అనుకూలంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ రద్దుకై కార్మిక వర్గం ఐక్య పోరాటాలతో ముందుకు సాగుతోంది మేడే పిలుపు ఈ సారాంశమే. కనీస వేతనం - పర్మినెంట్ చేయాలని పోరాటమే కార్మికులు ముందున్న ప్రస్తుత లక్ష్యం - కార్మికులు ఈ లక్ష్యాన్ని చేదించాలంటే నేడు పాలిస్తున్న మనువాద బిజెపి ప్రభుత్వం కాలగర్భంలో కలిస్తే తప్ప కార్మికులకి న్యాయం జరగదు అందుకే సిఐటియు పోరాటంలో కార్మికులందరూ ఐక్యంగా కలిసి రావాలని మేడే పిలుపునిస్తోంది. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ఆర్ ఆర్ వి పుష్పకుమారి, మండల ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి జ్యోతి, వర్కర్స్ యూనియన్ నాయకులు మారేశ్వర రావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు, వి వీరమ్మ,సివిల్ సప్లై మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేశ్వరరావు, ఇంటర్సిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు జె అనిల్ కుమార్, న్యాయవాది ఆర్ రమేష్ బాబు, శేషయ్య, పూర్ణ, మార్కెట్ ముఠా నాయకులు పి చంట్టి , రైసింగ్ నాయకులు వెంకటరెడ్డి, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు,










