మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-ఉలవపాడు :వినాయక చవితి సందర్భంగా ఉలవపాడు శ్రీ సాయి ఓరియంటల్ పాఠశాల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. కరెస్పాండెంట్ శేషమ్మ మాట్లాడుతూ వివిధ రకాల రసాయనాలతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాల వల్ల కాలుష్యం పర్యావరణ ముప్పు వాటిల్లుతుందన్నారు. కొంతవరకైనా మట్టి విగ్రహాలు వల్ల ఉపయోగం ఉంటుందన్నారు.










