ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్ : ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలోని మినిపార్కులో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం ఏర్పాటుకు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో విశ్వేశ్వరయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం. వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు ఈదర వెంకట సురేష్‌బాబు, యనమల నాగరాజు, చింతపల్లి గోపి, ప్రముఖ ఇంజినీర్ ఎన్ఎస్.రాజు, ఎఎంసి చైర్మన్ కొటారి రామచంద్రరరావు తదితరులు పాల్గొన్నారు.